#Mylavaram Assembly : ఆంద్ర ప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం మైలవరం..!? ఇక్కడ నేతల మధ్య విభేదాలు సర్వసాధారణం .. ఆ పార్టీ ఈ పార్టీ అన్నతేడా లేదు. అధికార వైసీపీ అయినా.. ప్రతిపక్ష టీడీపీ అయినా గ్రూపులు.. విభేదాలు కామన్. గతం లో హేమాహేమీలు చనుమోలు వెంకటరావు , వడ్డే శోభనాద్రీశ్వర్ రావు , జేష్ఠ రమేష్ బాబు తదితలు ప్రాతినిధ్యం వహించారు . ఇక్కడ చనుమోలు వెంకటరావు 5 సార్లు ( 1967, 1972, 1978, 1985, 2004) గెలిచి రికార్డు స్థాపించారు. ఇక దేవినేని ఉమా 2009, 2014 లలో వరుస విజయాలు సాధించారు. దేవినేని ఉమా 1999, 2004 లలో పక్కనే ఉన్న నందిగామ నియోజకవర్గం నుండీ గెలుపొందారు .
2019 ఎన్నికల్లో దేవినేని ఉమా పై 12 వేలకు పైగా మెజారిటీ తో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ అభ్యర్థి గా గెలుపొందారు. జనసేన అభ్యర్థి రామ్మోహన్ కు 8500 పైగా ఓట్లు సాధించడం, తెదేపా నాయకులు గెలుపు ను సునాయాసం అని భావించడం, పోల్ మేనేజ్మెంట్ లేక చతికిల పడ్డారు . రాష్ట్రవ్యాప్తం గా వైసీపీ కి వ్యతిరేకం గా తెదేపా , బీజేపీ, జనసేనలు ముప్పేట దాడి చేస్తున్నాయి . ఈ నేపధ్యం లో నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర , చంద్రబాబు జలహారం యాత్ర, జనసేనాని వారాహి యాత్ర 3 జోరుగా జరుగుతుండగా అధికార వైసీపీ కేవలం న్యూ మీడియా ని , రోజువారీ మీడియా మేనేజ్మెంట్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది .
గత ఎన్నికల్లో ఉపయోగ పడిన కుల చిచ్చు వగైరాలు ఇప్పుడు పని చేయడం లేదు . ఇక తెదేపా లో దేవినేని ఉమా కు స్థానికం గా అంతగా ప్రాధాన్యత లేని ఒక వర్గం కొంత అసమ్మతి హడావుడి చేస్తోంది. ఆ వర్గానికి ఎంపీ కేశినేని నాని అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది . తెదేపా విజయవాడ ఎంపీ అభ్యర్థి ని మార్చడం ఖాయమనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి . దానికి అనేక కారణాలు వున్నాయి . ముఖ్యంగా అది స్వయంకృతం . మరింత విపులమైన విశ్లేషణకు ఈ క్రింది వీడియో ను చూడండి .