Thursday, November 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshనారా లోకేష్ యువ గళం యాత్ర ... పల్నాడు లో ... ఎన్నడూ చూడని రీతిలో...

నారా లోకేష్ యువ గళం యాత్ర … పల్నాడు లో … ఎన్నడూ చూడని రీతిలో …!?

మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నేటి పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ముప్పరాజుపాలెం వద్ద నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఉమ్మడి గుంటూరు నేతలు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు . స్వాగత ఏర్పాట్లు అపూర్వంగా ఏర్పాటు చేసారు మాజీ MLA ఆంజనేయులు . వేదం పండితుల ఆశీర్వచనం , మంగళ వాయుద్యాలతో వేలాదిమంది కార్యకర్తలు అభిమానులు ఎదురు రాగా నారాలోకేష్ పల్నాడు లోకి అడుగులు వేశారు .

నారా లోకేష్ కు స్వగతం పలికిన వారిలో మాజీ MLA లు ఆలపాటి రాజా , తెనాలి శ్రవణ్ , కన్నా లష్మినారాయణ , పత్తిపాటి పుల్లారావు , యరపతినేని , కొమ్మాలపాటి శ్రీధర్ , జూలకంటి బ్రహ్మారెడ్డి , ధూళిపాళ్ల నరేంద్ర , నక్కా అనంద బాబు లతో జిల్లా నాయకులు కోవెలమూడి రవీంద్ర , భాష్యం ప్రవీణ్ , నజీర్ అహ్మద్ , వేగ్నేశ నరేంద్ర వర్మ , కందుకూరి వీరయ్య , గోనుగుంట్ల కోటేశ్వర రావు , అరవింద బాబు , పోతినేని శ్రీనివాస్ తదితరులు వున్నారు .

ఇక వినుకొండ నియోజకవర్గ అభిమానులు , కార్యకర్తల హడావుడి ఆకాశాన్ని తాకింది . భారీ గజమాలలు , స్వాగత ద్వారాలు , బాణాసంచా , అడుగడుగునా మహిళల హారతులతో విజయోత్సవాన్ని తలపించేలా హోరు పుట్టింది

Yuvagalam @vinukonda

02 August 2023 సాయంత్రం

  • 4:00 – వినుకొండ గంగినేని డిగ్రీకాలేజి వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
  • 4:20 – చెక్ పోస్టు వద్ద స్థానికులతో సమావేశం.
  • 4:40 – ముండ్లమూరు బస్టాండులో స్థానికులతో మాటామంతీ.
  • 5:00 – ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
  • 6:15 – బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
  • 9:45 – నగరాయపాలెం విడిది కేంద్రంలో బస.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments