మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్కు దాఖలైంది . తెలంగాణ హైకోర్టులో తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఆ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ భారాసా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మంత్రి వేసిన పిటిషన్‌ను నేడు కొట్టివేసింది.
నేపధ్యం : శ్రీనివాస్ గౌడ్ గతం లో ఇచిన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్‌నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరువాదనలు పూర్తి అవగా.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం పిటిషనర్ రాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.
కొత్తగూడెం MLA వనమా ఎన్నిక చెల్లదు
తెలంగాణ హైకోర్టు నేడు మరొక సంచలనాత్మక తీర్పు ను వెలువరించింది . వనమా ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు తప్పుగా చూపారంటూ జలగం వెంకట్రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం mla ఎన్నిక చెల్లదని ఇక నుంచీ జలగం వెంకటరావు కొత్తగూడెం MLA అని కూడా తీర్పులో పేర్కొంది . 5 లక్షల జరిమానా ను కూడా వనమా కు విధించింది .