ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 10 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో NDA సమావేశానికి జనసేనాని , నాదెండ్ల మనోహర్ తో కలసి హాజరు అయ్యారు . గత కొంత కాలం గా వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం ఏ త్యాగాల కోసం అయినా సిద్దమే అని పలు సార్లు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది . బ్జాజాపా తో ఏ విధమైన కార్యక్రమాలు గత 4 ఏళ్ళు గా చేయక పోయినా , రోడ్ మ్యాప్ ఇస్తాము అంటూ కేంద్ర భాజపా 4 ఏళ్ళ పుణ్యకాలం గడిపింది .
జనసేనాని పై విశాఖ లో జరిగిన దాష్టీకం తర్వాత కేంద్ర బలగాల సెక్యూరిటీ ఇవ్వాలన్న తలంపు కూడా కేంద్ర పెద్దలకు రాక పోవడం కూడా రాజకీయ విశేషమే … కర్ణాటక ఎన్నికల్లో జనసేన సహాయం కోా రకపోవడం కూడా రాజకీయాల్లో చర్చనీయ అంశం గా మారింది . ఇక జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తో 4 ఏళ్ళు గా ఒంటరి పోరాటం చేస్తున్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ కలవడం , చంద్రబాబు కూడా భేషజాలకు పోకుండా జనసేనాని ఇంటికి వెళ్లి పరస్పరం ఉమ్మడి పోరాట దిశగా అడుగులు వేస్తున్న దశలో NDA సమావేశం జరిగింది .
సోము వీర్రాజు కు కేంద్ర భాజాపా వీడ్కోలు పలికి నందమూరి తారకరాముని కుమార్తె , అందరూ చిన్నమ్మ గా పిలిచే దగ్గుపాటి పురందరేశ్వరి ని రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలిగా ప్రకటిచడం తో కొంత స్పష్టత ఇచ్చినట్లయుంది . ఇక ఈ నేపథ్యం లో కేంద్ర భాజాపా పెద్దలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమిత్ షా తో పవన్ 25నిమిషాల భేటీ అనంతరం ఇరువురు ట్వీట్లు చేశారు. భేటీ కి ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెదేపా , జనసేన , భాజాపా కలసి పోటీ చేస్తాయంటూ సంకేతాలు ఇచ్చారు .
పవన్ ఉమ్మడి పోటీ వ్యూహం పసుపు సైనికులకు రుచించడం లేదు . జనసైనికులతో కలసి ప్రయాణానికి మానసికంగా సిద్ధమైనా , వైసీపీ తో రహస్య ప్రేమాయణం లో మునిగి తేలుతున్న భాజపా తో కలవడానికి తెదేపా నాయకత్వం ససేమిరా అంటోంది . భాజాపా తో పొత్తు పోసాగాలంటే గత నాలుగేళ్ళ వైసీపీ పాలనా లో జరిగిన అవినీతి పై విచారణ , తమిళనాడు లో కేంద్రం జరుపుతున్న విచారణ రీతిలో జరగాలి అన్నది టీడీపీ డిమాండ్. వేల కోట్ల అవినీతి ఒక్క లిక్కర్ స్కాం లోనే జరిగిందనేది టీడీపీ వాదన . ఇక సొంత బాబాయ్ దారుణ హత్య కేసులో కూడా నిందితుల్ని ఎవరు కాపాడుతున్నారనేది తెలుగుదేశం ప్రధాన ఆరోపణ గా వుంది . వీటిపై భాజాపా తగు చర్యలతో స్పష్టత ఇవ్వకపోతే , తెదేపా పొత్తులకు సిద్ధమయ్యే అవకాశం శూన్యమే .. జనసేనాని ఏ నమ్మకం తో పొత్తుల గురించి మాట్లాడారో రాబోయే వారం లో స్పష్టత వచ్చే అవకాశం వుంది …