ఈ సంవత్సరం అధిక మాసం జూలై 18 2023 న మొదలై ఆగస్టు 16న ముగుస్తుంది. ఈ అధికమాసంలో శుక్ల పక్షం తొలుతగా వస్తుంది, ఆ తర్వాతే కృష్ణ పక్షం వస్తుంది. శ్రావణం కృష్ణ పక్షం, అధిక మాసం శుక్ల పక్షం ఒక నెల ఉంటుంది. ఆ తర్వాత అధిక మాసంలోని కృష్ణ పక్షం, శ్రావణ శుక్ల పక్షం ఒక మాసం అవుతుంది. ఈ విధంగా, ఈ సంవత్సరం శ్రావణం 2 నెలలు ఉంటుంది.
అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని అంటారు. ఈ అధిక మాసంలో విష్ణు పురాణం, భాగవతం కధలు మొదలైనవి వినడం, ఉపవాసం, పారాయణం, భజనలు మొదలైన హరి సేవా కార్యక్రమాలు మేలు చేస్తాయి.
మరిన్ని విశేషాల కోసం గురు శ్రీ వేమూరి కోటేశ్వర శర్మ గారి వీడియొ చూడగలరు . హరిః ఓం