[ad_1]
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’. సోమవారం ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇందులో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ”నిర్మాత నిరంజన్ రెడ్డి మాపై నమ్మకం పెట్టి ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన వల్లే హనుమాన్ సినిమా సాధ్యమైంది. ఈ సినిమాతో ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించా. సినిమాని వీఎఫ్ఎక్స్ పార్ట్ ప్రేక్షకులకు స్టన్నింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది” అని అన్నారు.
ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ టీజర్ లాంచ్
[ad_2]