[ad_1]
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్ సింగిల్‌పై భారీ హైప్‌ని క్రియేట్ చేశారు. నాని రగ్గడ్ లుక్ తో కనిపించిన ఫస్ట్ సింగల్ గ్లింప్స్ వీడియో క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడా నిరీక్షణ తెర దించుతూ ధూమ్ ధామ్ ధోస్తాన్ పాటను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ-శైలి జానపదంతో పాట ప్రారంభమైయింది. తన టీమ్, బ్యాండ్ లో ఎనర్జీని నింపడానికి కి మద్యం బాటిల్‌ను అందిస్తాడు నాని. తర్వాత, ఆర్కెస్ట్రా బీట్స్ పెంచడంతో ధూమ్ ధామ్ ధోస్థాన్ మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా మాస్ జాతర క్రియేట్ చేసింది.
[ad_2]