[ad_1]
సీనియర్ నటి మీనా అందాల తార ఐశ్వర్యా రాయ్‌ను చూసి అసూయపడుతున్నారు. ఆమెను చూస్తే చాలా ఈర్షగా ఉందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు మీనా. ‘పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఎప్పటి నుంచో నా డ్రీమ్ క్యారెక్టర్. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించిన ఐశ్వర్య రాయ్ చూస్తే అసూయగా ఉంది. నా డ్రీమ్ రోల్లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. నా జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తిని చూసి అసూయపడుతున్నాను. ఇది మనసులో ఉంచుకోలేక బయటపెట్టేస్తున్నా’. అంటూ స్త్మ్రలీ ఎమోజీలను జత చేశారు మీనా.
[ad_2]