[ad_1]
ముంబై: ‘పుష్ప’ సినిమాలో నటించిన రష్మిక మందన్న నటన అంత త్వరగా ఎవరూ మరచిపోరు. ఆమె అందంగా కూడా ఉంటుంది. కాగా ఇటీవల ఆమె ముంబైలో ఓ అవార్డు వేడుకలో ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి స్టెప్పులేసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ‘సామి…సామి…’ పాటకు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హోస్ట్ మనీశ్ పౌల్ కూడా ఆమెతో పాటు వేదికను పంచుకున్నారు. ముంబైలో ‘లోక్‌మత్ మోస్ట్ స్టయిలిష్ అవార్డ్’ సందర్భంగా ఆమె వేదికను పంచుకున్నారు. ఆ అవార్డు షోకు సంబంధించిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
[ad_2]