Tuesday, February 4, 2025
spot_img
HomeElections 2023-20243 రాష్ట్రాల్లో  కాంగ్రెస్ గాలి !….    16 నుంచీ 28 వరకూ తెలంగాణ లోనే ...

3 రాష్ట్రాల్లో  కాంగ్రెస్ గాలి !….    16 నుంచీ 28 వరకూ తెలంగాణ లోనే  రాహుల్ , ప్రియాంక మకాం … 

Hyderabad:

  •  ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సంపూర్ణంగా విజయం సాధించే దిశగా ఛత్తీస్ ఘర్ , మధ్య ప్రదేశ్ , మిజోరాం రాష్టాల్లో కాంగ్రెస్ పయనిస్తోందని వార్తలు వస్తున్నాయి . ఇదే విషయాన్ని పలు జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి .  
  • ఇక తెలంగాణ లో హోరా హోరీ గా ఎన్నికలు జరిగే అవకాశం దృష్ట్యా కాంగ్రెస్‌ అధిష్ఠానం పూర్తిస్థాయిలో తెలంగాణ పై  దృష్టిసారించింది. ఇప్పటికే ఒక దఫా రాహుల్‌ గాంధీ పర్యటించి వెళ్లగా.. ఇప్పుడు మరోసారి ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. 
  • నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సుడిగాలి పర్యటనలతో తెలంగాణను చుట్టేయనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 28 తేదీ వరకూ  విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , మల్లిఖార్జున ఖర్గే , 
  •  ప్రస్తుతం సెమి ఫైనల్ గా చెబుతున్న  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ ,  ఛత్తీ్‌సగఢ్‌, మిజోరాం లలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ వర్గాల అంచనా . ఇక హోరా హోరీ పోరులో వున్న  తెలంగాణలోనూ ఈసారి కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని ఆ కాంగ్రెస్  వర్గాలు పూర్తి నమ్మకం తో  ఉన్నాయి. 
  • ఇక, రాజస్థాన్‌ విషయంలో సర్వేలు భిన్న ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి  సారించింది . 
  •  మధ్యప్రదేశ్‌లో ప్రచార గడువు ఈనెల 15తో ముగియనుంది. ఆ తర్వాత నవంబర్  16 నుంచి తెలంగాణ  రాష్ట్రంలో  ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకూ కాంగ్రెస్ అగ్ర నేతలందరూ  విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌పై ముమ్మరంగా కసరత్తు . 
  • తెలంగాణలో అయితే రాహుల్‌.. లేకుంటే ప్రియాంక ప్రచారం ప్రతి రోజూ ఉండేలా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం 
  • సీఎం కెసిఆర్ పై కామారెడ్డి లో పోటీ కి సిద్దమైన రేవంత్ రెడ్డి . ఈ నెల 10 న కామారెడ్డి లో రేవంత్ రెడ్డి నామినేషన్ . ఈ కార్యక్రమానికి , కర్ణాటక సీఎం సిద్దరామయ్య  హాజరు అయ్యు , కామారెడ్డిలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 
  • కామారెడ్డి  సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించే ఆస్కారం. 
  • అదే విధంగా ఈనెల 9న మైనార్టీ డిక్లరేషన్‌ను గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులు విడుదల చేయనున్నారు.
  • రేపటి నుంచీ ప్రచార బాట లో  రేవంత్‌ రెడ్డి .  ఉదయం 11.30 గంటలకు అలంపూర్‌ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు .  అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల లో  బహిరంగ సభ.  ఆ తర్వాత మక్తల్‌ పబ్లిక్‌ మీటింగ్‌. 
  • నవంబర్‌ 8న వరుసగా ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, రాజేంద్రనగర్‌ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.
  •  నవంబర్‌ 9న ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ సభల్లో పాల్కొంటారు. 1
  • 10న కామారెడ్డి సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి పాల్గొంటారు. అనంతరం జహీరాబాద్‌ సభలో పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం గోల్కొండలో మైనార్టీలతో డిన్నర్‌ సమావేశం. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments