[ad_1]
జెడ్డ: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయన సినిమాలు అనేక బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. షారూఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఏర్పాటు చేసిన ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ‘ రెండవ పునరావృతం(ఐటరేషన్)కు ఫిల్మ్ హాజరయ్యాడు. ఆయనతో పాటు ఈ ఫిలిం ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తం నుంచి నటినటులు. మన దేశం నుంచి ప్రియాంక చోప్రా, ఏఆర్. రహ్మాన్ కూడా.
ఈ ఫిలిం ఫెస్టివల్‌లో షారూఖ్ ఖాన్, అమెరికా నటి షెరాన్ స్టోన్ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే ఆ ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చిన ప్రేక్షకులు, అతిథులు, ప్రోగ్రామ్‌లు బాగా చూడడానికి ‘లైటింగ్’ ఏర్పాటు చేయలేదు. అంతా మసకమసకగానే వీడియోలు వచ్చాయి. యాంకర్ చివరికి షారూఖ్ ఖాన్‌ను అక్కడ ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేసింది. అప్పుడు అమెరికా నటి షెరాన్ స్టోన్ ‘ఓ మై గాడ్’ అంటూ తన భావాన్ని ఆపుకోలేకపోయింది. నల్లని గ్లోజ్ ధరించిన ఆమె చేతులను గుండెలపై పెట్టుకుని మరీ తన రియాక్షన్‌ను వెలువరించింది. అయితే షారూఖ్ మాత్రం ఆమె వైపు వంగి ‘హలో ‘ అనగా ఆమె ‘నమస్తే’ అంది. ఇద్దరు పరస్పరం తమ అభినందలు ఆ విధంగా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్‌లో షారూఖ్ ఖాన్‌కు సన్మానం జరిగింది. ఆ సమయంలో ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి అరబీ భాష తన కృతజ్ఞతలు తెలిపారు. ఓ ఫిలిం ఫెస్టివల్‌లో తనను తొలిసారిగా ఇంతలా గుర్తించినందుకు తాను థ్రిల్ అయ్యానని ఆయన ప్రేక్షకులకు తెలుపుకున్నారు.
ఈరోజు ఈవెంట్లో నాకు ఇష్టమైన భాగం, షారూఖ్ ఖాన్ తన పక్కనే కూర్చున్నాడని తెలుసుకున్న షారన్ స్టోన్ స్పందన.. మనం ఆమెను నిందించలేము కదా?#షారుఖ్ ఖాన్#RedSeaIFF22 pic.twitter.com/9avyz9OItc
— ఆన్ (@Unreal_Ann) డిసెంబర్ 1, 2022
تكريم شاروخان من قبل #مهرجان_البحر_الأحمر_السينمائي_الدولي وحيث ఆలక్
pic.twitter.com/Xlai03EFnh
— అరబ్ షారూఖ్ ఖాన్ (@ArabSRK_) డిసెంబర్ 1, 2022
[ad_2]