[ad_1]
‘కెజిఎఫ్’ సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్ సంస్థ ప్రస్తుతం రిషబ్ శెట్టి హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘కాంతారా’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ నటిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు నటిస్తున్నారు. ఈ విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేయనున్నారు. ‘కాంతారా’ అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లాదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేశారు. నవంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
[ad_2]