[ad_1]
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ తన భార్యకు ప్రతి నెలా 8లక్షల భరణం చెల్లించాలని విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు జడ్జీ ఆదేశాలరు జారీచేశారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ తో 1984లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, సెక్షన్ 498ఎ గృహహింస చట్టం కింద శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తన భర్త నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న ఆమె విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశారు.
[ad_2]