[ad_1]
అమరావతి: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐబిఎఫ్ మార్గదర్శకాల ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు సమయాలను అనుసరించాలని అభ్యర్థించారు. షోలో అసభ్యత ఉందని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య షో ప్రసారం చేసేలా బిగ్ బాస్ నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఎపి హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయస్థానం అశ్లీలతపై ఘాటుగా స్పందించింది. ప్రతివాదలకు నోటీసులపై త్వరలో నిర్ణయిస్తామని పేర్కొంది. విచారణ అక్టోబర్ 11కు హైకోర్టు వాయిదా వేసింది.
[ad_2]