[ad_1]
‘యశోద’ బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఆమె కథానాయికగా నటించిన ‘యశోద’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను ఉద్దేశించి సామ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “డియ ర్ ఆడియన్స్ యశోద సినిమాపై మీరు చూపిస్తు న్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, ఆదరణ చూస్తున్నాను.
ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు స్పందన నాకెంతో సంతోషాన్నిస్తోంది. యశోద రిలీ జ్ అయిన థియేటర్లలో సందడి చేశాను.
సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టుకు పనిచేసిన వాళ్ళకు థాంక్స్ చెబుతున్నాను.
కథ, నాపై నమ్మకం పెట్టిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్‌కి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పని చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది”అని సమంత పేర్కొన్నారు.
[ad_2]