Brs ex mla Thatikonda Rajaiah Likely To Join Congress | Station Ghanpur
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ వలసలకు శ్రీకారం చుట్టింది. ఒకరకంగా చేరికలకు గేట్లు ఎత్తేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాలలో చేరికలు విపరీతంగా జరిగిపోయాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి .. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు..అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు . అంతేకాక జెడ్పీ చైర్‌పర్సన్లు, మాజీమంత్రులు, మాజీ మేయర్లు సైతం కాంగ్రెస్ కి క్యూ కడుతున్నారు .త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టి అత్యధిక సీట్లు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి . కారుని ఖాళీ చేస్తుంది . ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ లిస్ట్ లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు వినిపిస్తుంది . బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చర్చలు సఫలం కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి క్రమంగా బీఆఎస్ బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే గులాబీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు.. బిఆర్ఎస్ బెదిరించే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో ..కాంగ్రెస్ మరింత అప్రమద్దమయింది .. అయితే నేతలు చేరికలతో సరికాదు . వారిని పార్టీకి జాగ్రత్తగ ఉపయోగించుకోవాలి .. బిఆర్ఎస్ కూడా గతంలో ఇష్టం వచ్చినట్టు నేతలని చేర్చుకొని తర్వాత దెబ్బ తిన్నది .. అందుకే చేరికలని తెలివిగా ఉపయోగించుకొని .. పార్లమెంట్ ఎన్నికల్లో పవర్ చూపించాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఉంది .