Thursday, March 28, 2024
spot_img
HomeCinemaఒంపుసొంపుల సోయగం

ఒంపుసొంపుల సోయగం

[ad_1]

మృణాల్ ఠాకూర్… ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ భామ ఒక్క సినిమాతో తెలుగువారి మనసు దోచుకుంది. ‘సీతారామం’ చిత్రంలో సీతగా, ప్రిన్సెస్‌గా అదరగొట్టింది. ఈ బ్యూటీ నటనకి ఫిదా అయింది తెలుగు ప్రేక్షకలోకం. సినిమాలో ఒద్దికగా, సంప్రదాయ బద్దంగా కనిపించిన ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలొలికిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ భామ తన ఒంపుసొంపుల సోయగాన్ని పూర్తిగా చూపించే ఫోటోలతో మురిపిస్తోంది. హిందీలో ఆమెకి విజయాలు లేకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరున్నర మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే కారణం ఆమె అందచందాల ప్రదర్శనే. బాలీవుడ్‌లో ఈ భామ హృతిక్ రోషన్ సరసన ఒక సినిమాలో నటించింది. అది ఓ మోస్తారు విజయం సాధించింది. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ సరసన ‘ఫైటర్’ మూవీ చేసింది. అది ఆడలేదు. ఆ తర్వాత ‘సీతారామం’లో నటించింది. ఇది తెలుగులో భారీ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తోంది. కేవలం సంపద్రాయ పాత్రలే కాదు గ్లామర్ రోల్స్, మసాలా సినిమాల్లో పాత్రలు కూడా చేస్తానని ఇలాంటి ఫోటోషూట్‌లతో హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments