[ad_1]
తమ తొలి తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్.. రెనైసెన్స్ పిక్చర్స్‌తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. అతని 13వ చిత్రంగా రాబోతున్న ఈ నూతన చిత్రం నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది.ఫ్రంట్ లైన్ హీరోల స్ఫూర్తి, వైమానిక దాడులతో పోరాడుతున్నప్పుడు వారు ఎదుర్కొనే సవాళ్లను మునుపెన్నడూ చూపని విధంగా రూపొందబోతోంది.
[ad_2]