ఈటల కేంద్రంగా రేవంత్ బిగ్ స్కెచ్ .
కాంగ్రెస్ లో చేరికపై ఈటల క్లారిటీ ఇచ్చినా .. వార్తలు మాత్రం ఆగడం లేదు .. దీనికి పలు కారణాలు ఉన్నాయి . బీజేపీ లో ఈటల కి తనుకోరుకున్న స్థాయి ప్రాధాన్యత దక్కడం లేదు .. ఇప్పుడు కోరుకున్న సీటు కూడా దక్కుతుందో లేదో తెలియదు ..అలాగే లోక్ సభ ఎన్నికలకి సంబంధించి ఈటెలకు ఇప్పటివరకు ఎలాంటి కీలక బాధ్యతలు ఇవ్వలేదు .. ఇదే సమయంలో ఈటల సరికొత్త వ్యూహానికి తెరతీశారని.. పార్టీ మార్పు ప్రచారం కూడా అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్ సీటు తనకు ఇవ్వరని తెలియటంతో.. మల్కాజిగిరి సీటును ఈటల డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే మల్కాజిగిరిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. మరోవైపు.. ఈటలను మెదక్ నుంచి బరిలో దింపాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.. మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఈటల విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల.. పార్టీ మార్పు ప్రచారం పేరుతో . అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేసే వ్యూహం పన్నారంటూ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. .. ఇక కాంగ్రెస్ మాత్రం ఈటల వస్తే ఆహ్వానించడానికి రెడీ గానే ఉన్నట్టు తెలుస్తుంది .. ఈటల తెలంగాణాలో అధిక ఓటు బ్యాంక్ ఉన్న ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన వాడు ..అలాగే ఉద్యమకారుడు .. అందుకే ఈటలకి అటు సామాజికంగా ఇటు ఉద్యమ పరంగా పార్టీలకి అతీతంగా పరిచయాలు ఉన్నాయి ..ఈటల వస్తే అవన్నీ తమకు లభిస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది . 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి .. బిఆర్ఎస్ గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది .. వాళ్ళు బిఆర్ఎస్ కి వ్యతిరేఖంగా ఉన్నారు . అయితే ఈటల వలన బీజేపీ క్లి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది ..అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది .
అలాగే యూత్ జనాభాలో ముదిరాజ్ యువత ఎక్కువగా ఉంది . యువత బీజేపీ కి మల్లె ఛాన్స్ ఉంది .. లోక్ సభా ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది .. అందుకే బీజేపీ కి ఆ అడ్వాంటేజ్ ఇవ్వకుండా .. బిఆర్ఎస్ కి చెక్ పెడుతూ .. ముదిరాజ్ ఓట్లు ఏకపక్షంగా హస్తం వైపు రావాలంటే ఈటల వంటి నేత కాంగ్రెస్ లో ఉండటం ఉత్తమమని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది . అంతేకాక అసెంబ్లీ ఎన్నికల ముందు ముదిరాజ్ ఆత్మగౌరవ సభని బీజేపీ ఓఎన్ చేసుకుంది .. దీనితో ఆ వర్గం కొంత బీజేపీ కి అనుకూలంగా ఉంది ..అందుకే ఈటలని చేర్చుకొని ఆ వర్గానికి మరింత చేరువ కావాలని కాంగ్రెస్ భావిస్తుంది ..అంతేకాక ముదిరాజ్ లలో బలంగా ఉన్న నీలం ముదిరాజ్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది . ఇలా బలమైన నేతలతో .. ఓట్లు సంఘటితం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది ..అలాగే మెదక్ , జహీరాబాద్ లలో ముదిరాజ్ ల ఓట్లు ఎక్కువ.. అక్కడ బిఆర్ఎస్ స్ట్రాంగ్ గ ఉంది ..ముఖ్యంగా మెదక్ లోక్ సభ స్థానంలో బిఆర్ఎస్ కి తిరుగులేని ఆధిక్యత ఉంది ..అందుకే ఆ రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఈటలకి ఇచ్చి .. రెండు స్థానాల్లో పాగా వేసేలా ప్లాన్ చేస్తుంది ..అలాగే ఈటల తో పాటు కొందరు కీలక నేతలు హస్తం గూటికి వస్తే ..ఆ మేరకు కాంగ్రెస్ కి లాభం కలిగే ఛాన్స్ ఉంది .. ఈటల సేవల్ని లోక్ సభ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని .ఆ తర్వాత అయన స్థాయికి తగ్గ రీతిలో గౌరవప్రదమైన పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది .. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది ..ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఈటల విషయంలో ఎదో నొక క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది .