Avanigadda : ఆదివారం నాడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వారాహి సభను (Varahi Sabha) నాలుగో విడతను పవన్ ప్రారంభించి భారీ బహిరంగ సభలో మాట్లాడారు . అవనిగడ్డ సభ జనసునామీ ని తలపించింది. తెదేపా శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు . రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పానని పవన్ పునరుద్ఘాటించారు. తనకు పార్టీల కంటే రాష్ట్రం బాగుండాలనేదే ముఖ్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి.. జనసేన – టీడీపీ వ్యాక్సినే మందు. మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారు. కులం కంటే మానవత్వం గొప్పది. నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదు, గుణమే చూశా. నేను ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభ, సామర్థ్యం మాత్రమే చూస్తా..’ అని పవన్ అన్నారు.
- అవును ఇది కురుక్షేత్ర యుద్ధమే..
- మేం పాండవులం, మీరు కౌరవులు
- నా పోరాటం సీఎం పదవి కోసం కాదు … వస్తే తీసుకొంటా అన్నారు జనసేనాని
- జగన్ పరిస్థితి.. ఓడిపోయే ముందు హిట్లర్ పరిస్థితిలా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు.. 15 సీట్లు వస్తే చాలా గొప్ప’ అని పవన్ కళ్యాణ్ అన్నారు