[ad_1]
హీరో శ్రీవిష్ణు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ’అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీగా విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ.. “ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి అనే ఫిక్షనల్ పాత్ర తీసుకొని కొన్ని యధార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దాం. ఒక పోలీస్ విధిలో చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్‌లో ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్‌లైన్ ఇందులో చూపించబోతున్నాం. దర్శకుడు ప్రదీప్ వర్మ పూర్తి కథతో నా దగ్గరికి వచ్చారు. ఈ కథలో సంఘటనలు నిజంగా జరిగినవేనని సినిమా చేస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా తెలిసింది. ఈ కథ విన్నప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇంత డెప్త్ ఉందా అనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలో మంచి, చెడులు ఇందులో చూపిస్తాం. చెడుకి పరిష్కారం కూడా చూపిస్తాం. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇక ఇప్పుడు నా నుండి రాబోతున్న మూడు సినిమాలు కూడా పూర్తిగా వైవిధ్యమైనవే. ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ ఫేమ్ హాసిత్‌తో, సాయి అనే కొత్త దర్శకుడితో, ‘హుషారు’ ఫేమ్ హర్షతో సినిమాలు చేస్తున్నా”అని అన్నారు.
[ad_2]