Monday, July 15, 2024
spot_img
HomeCinema'హరిహర వీరమల్లు' వచ్చేది అప్పుడేనా..?

‘హరిహర వీరమల్లు’ వచ్చేది అప్పుడేనా..?

[ad_1]

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. గత ఏడాది నుంచి ఈ సినిమా విడుదల తేదీపై ఊహించని మార్పులు జరుగుతున్నాయి. అసలు ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా అనేక రకాల డేట్స్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఒక విధంగా తర్వాత ఆ తర్వాత అతి పెద్ద గ్యాప్ వస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలు కారణంగా షూటింగ్‌కు మరికొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నారు.

హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఉంచినట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు క్రిష్ అయితే పవన్ కళ్యాణ్ అతనితో అవసరం లేనటువంటి కొన్ని సన్నివేశాలను అయితే పూర్తి చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక దర్శకుడు క్రిష్ కూడా ఈసారి ప్రక్క ప్లాన్ తో ఈ స్టార్ తో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుని షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా 2023 సమ్మర్‌లో విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిసింది. అయితే 2023 మంచి సంక్రాంతిని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చే సమ్మర్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అని పవన్ కళ్యాణ్ తో ఇదివరకే రెండు సార్లు చర్చలు జరిపారు. పవన్ కూడా మరొక సినిమా షూటింగ్ పెట్టుకోనని కేవలం ఈ సినిమా కోసమే పని చేస్తాను అని మాట ఇచ్చాడని సమాచారం. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌కు వస్తుందో లేదో చూడాలి.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments