[ad_1]
మన తెలంగాణ/హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూరి కనెక్ట్ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మిలు నిర్మించారు. అయితే ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టాలనే అనుమానంతో ఇడి పూరి జగన్నాథ్, ఛార్మిలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్, చార్మిలను గురువారం ఉదయం నుంచి ఇడి ప్రశ్నిస్తోంది. కాగా, 15 రోజుల క్రితమే పూరీకి ఇడి నోటీసులు ఇచ్చినట్లు. విదేశీ పెట్టుబడులపై పూరీ జగన్నాథ్‌ను ఇడి ప్రశ్నిస్తున్నట్లు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, చార్మిలను విచారించిన విషయం విధితమే. అయితే ఆ కేసులో పూరి జగన్నాథ్, చార్మిలతో పాటు ఇతరులకు కూడా ఇడి క్లీన్ చిట్‌ను ఇచ్చింది. అయితే.. తాజా పరిణామాలలో ఈడీ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.
పూరీ జగన్నాధ్, ఛార్మీలను ప్రశ్నిస్తున్న ఈడీ
[ad_2]