[ad_1]
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు కృష్ణ సతీమణి, టాలీవుడ్ హీరో మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి కన్నుమూశారు. ఆమె మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
[ad_2]