[ad_1]
ఇండస్ట్రీలో హీరోల పారితోషికంతో తాజా హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువ. హీరోలు ఏడాది ఒకటి రెండు సినిమాలు చేస్తే హీరోయిన్లు మాత్రం నాలుగైదు సినిమాలు చేస్తూ ఆ లోటును మార్చుకుంటున్నారు. దీనికి తోడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్.. కమర్షియల్ యాడ్స్.. సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రచారం చేస్తూ సంపాదనలో తాము హీరోలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇక మార్కెట్ ను సొమ్ము చేసుకోవడంలో అందరి కంటే హీరోయిన్లు ముందు ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ లిస్టులో వెటరన్ బ్యూటీ త్రిష పేరు మరోసారి తాజాగా వినిపిస్తోంది. 39 ఏళ్ళ వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న త్రిష తాజాగా తన పారితోషికాన్ని డబుల్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇండస్ట్రీకి ఇప్పుడు పరిచయం అవుతున్న హీరోయిన్లు ఒకటి రెండేళ్లలోనే కనుమరుగు అవుతున్నాయి.
[ad_2]