Monday, July 15, 2024
spot_img
HomeCinemaత్వరలో తెలుగులో సినిమా చేసి.. హిందీలో రీమేక్ చేస్తా: వరుణ్ ధావన్

త్వరలో తెలుగులో సినిమా చేసి.. హిందీలో రీమేక్ చేస్తా: వరుణ్ ధావన్

[ad_1]

వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేడియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ తెలుగులో జరిగింది. ఈ సమావేశంలో నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ “ఈ సినిమా అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. 25న విడుదలయ్యే ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేశాం. మంచి సినిమా ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్‌గా మారింది. నిర్మాత దినేష్ విజన్… పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అని నమ్మి అతనితో సినిమా చేయడానికి వచ్చారు. భవిష్యత్తులో ఆయన అల్లు అర్జున్‌తో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్‌లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూస్తే నాకు అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి.

ఈ తెలుగులో సినిమా విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను”అని తెలియజేసారు. వరుణ్ ధావన్ మాట్లాడుతూ “ఇండియాలో చాలామంది టాలెంట్ ఉన్న వ్యక్తులు ముంబై, హైదరాబాద్‌కి చెందిన వాళ్ళే. మనం భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్‌లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అని చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తాను. తోడేలు సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృతి సనన్ ఉంటుంది.

హైదరాబాద్‌లో తోడేలు మూవీ ప్రీ ప్రెస్ మీట్

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments