[ad_1]
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని సోమవారంప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని పొందిన చిరంజీవికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న పాత్రల పోషణ, అద్భుత వ్యక్తిత్వంతో తరతరాల సినీప్రియులను చిరంజీవి ఆకట్టుకున్నారని అన్నారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎడిషన్ ఆదివారం ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దియర్ అవార్డుతో సత్కరించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. చిరంజీవి విశిష్టమైన వ్యక్తి. తన అద్భుత నటనతో ఎన్నో పాత్రలు పోషించి కొన్ని తరాలను అభిమానాన్ని చూరగొన్నారు. ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం పొందినందుకు అభినందనలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. కాగా నాలుగు దశాబ్దాలకుపైగా సినీ కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవి 150కిపైగా చిత్రాల్లో నటించారు. అత్యధికంగా తెలుగు చిత్రాలతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ చిరంజీవి నటించారు.
చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తారల ప్రేక్షకుల అభిమానాన్ని , ఆదరణనూ చూరగొన్నారు. https://t.co/yQJsWL4qs8
– నరేంద్ర మోదీ (@narendramodi) నవంబర్ 21, 2022
మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు
[ad_2]