వైసిపి ఎంపి జనసేనలోకి…!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తీ స్థాయిలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు… ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్నారు.
ప్రజా పోరాట యాత్రలో ప్రజల మధ్య ఉంటున్న పవన్ కళ్యాణ్ ఏపీలో మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ నాయకుల విశ్లేషణ.
ఇక గత ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరం చేసిన గోదావరి జిల్లాలో పర్యటిస్తూ… కాపులకు వ్యక్తిరేకంగా బిసిలను ఆకట్టుకునే విధంగా ప్రసంగిస్తున్నారు.. ఇక పవన్, జగన్ ల మధ్య జరుగుతున్న వార్ పై వైసిపి అరకు ఎంపి
కొత్త పల్లి గీత జగన్ … పవన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… పవన్ కళ్యాణ్ కు తన మద్దతు అని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కొత్త పల్లి గీత నెక్స్ట్ ఎన్నికల్లో వేరే పార్టీ చేరాలని భావిస్తే… అది జానసేన మాత్రమే అని… సన్నిహిత వర్గాల మాట.. ఇదే నిజమైతే.. జనసేనకు మంచి బలమైన అభ్యర్ధి దొరికినట్లే అని రాజకీయ విశ్లేషకుల మాట.. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఫిరాయింపులకు చోటు లేదు అని చెబుతున్నారు.. మరి గీత విషయంలో ఆ నిబంధన పక్కన పెడతారా..! లేక సరికొత్త రాజకీయాలకు ప్రాణం పోస్తారా… అనే ఆసక్తి రాష్ట్రంలోని ప్రజల్లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here