వైఎస్.భారతిపై ఈడీ కేసుకు జగనే కారణం : మంత్రి అయ్యన్నపాత్రుడు

కుటుంబంలోని ఆడవాళ్లను రోడ్డుకు లాగిన జగన్మోహన్ రెడ్డి., ఇప్పుడు చంద్రబాబే అందుకు కారణమని ఆరోపించడం కరెక్టు కాదన్నారు. తల్లిని, చెల్లిని, భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. విశాఖపట్నం లో వైఎస్ విజయలక్ష్మి ఒడిపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణమన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లినప్పుడు పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల., ఇపుడు కనబడకపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డే అని అన్నారు. అలాగే వైఎస్ భారతిపై ఈడీ కేసుల నమోదుకు కూడా జగన్మోహన్ రెడ్డే కారణమని, ఎదుటి వారిపై నిందలు వేయడం మానుకోవాలని, జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here