Devotional

ఎన్నో అద్భుతాలకు నిలయం.. పూరిజగన్నాధుడి ఆలయం

మనదేశంలో పుణ్యక్షేత్రాలకు నిలయం… ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకూ అనేక దేవాలయాలు… ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇక అటువంటి విశిష్టత కలిగి ప్రదేశం ఒడిస్సా రాష్ట్రంలోని పూరి. ఇక అనేక ప్రత్యేకతలు కలిసిన దేవాలయం… ఇక్కడ జగన్నాధుడి దేవాలయం… ఈ పూరి క్షేత్రాన్ని ఒకప్పుడు శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అనీ, పురుషోత్తమ పురి అనీ, జగన్నాథపురి అని పిలిచేవారు. ఈ పూరిలో ఉన్న ఆలయం కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.. ఇక్కడ ఉన్న దేవుడిని నీలమాధవుడని అంటారు. ఈ నీలమాధవునికి తొలి పూజలు చేసింది విశ్వవసు అనే శబర నాయకుడు. జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించింది గంగవంశస్థులు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం ఇంద్రద్యుమ్నుడనే మహారాజు తనకు కలలో కనపడిన దారువు (కొయ్యదుంగ)ను విగ్రహాలుగా చెక్కించి, వాటినే ప్రతిష్టించి, పూజలు జరిపాడు. ముగ్ధమనోహర రూపంలో ఉండే ఈ మూర్తులను చూడడానికి రెండు కనులు చాలవు అని పిస్తుంది.. ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీ జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు ‘బలభద్రుడు ‘తోనూ, సోదరి ‘సుభద్ర ‘తోనూ, కొలువుతీరి సేవలు అందుకొంటూ వుంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి. ఈ మూర్తులను శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు పూరిలో తమ మఠాలను ఏర్పాటు చేసుకుని మరీ కొలిచారు, తరించారు.
కాగా ఏడు అద్భుతమైన విషయాలు పూరి జగన్నాథుని ఆలయం సొంతం.
1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది.
2) పూరి ఆలయంపై ఉండే సుదర్శన చక్రం మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.
3) మామూలుగా సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.
5) గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.
6) ప్రపంచంలోని అతిపెద్ద వంటశాల పూరి జగన్నాథునిదే. ఇదే భోజనశాల కూడా. స్వామివారికి సమర్పించే నైవేద్య, భోజనాలన్నీ ఇక్కడే తయారవుతాయి. ఈ ప్రసాదాలన్నీ పర్యవేక్షించేది శ్రీ మహాలక్ష్మీదేవి. పాక కళాకోవిదులైన ఎందరో బ్రాహ్మణులు (పాండాలు) ముక్కుకి, నోటికి గుడ్డలు కట్టుకుని పదార్థాల వాసన కూడా చూడకుండా, భయభక్తులతో, ప్రతినిత్యం సుమారు 54రకాల పదార్థాలను స్వామివారి నైవేద్యానకి సిద్ధం చేస్తారు. పొరపాటున ముక్కుకు కట్టిన గుడ్డ జారితే, వండిన పదార్థాలను వృథా చేసి, మరలా కొత్తగా నైవేద్యాలను అన్నింటినీ సిద్ధం చేస్తారు. ఆ ప్రసాదాలనే భక్తులకు విక్రయిస్తారు. జగన్నాథుజు ప్రసాదప్రియుడు. అందుకే ఇన్ని రకాల నైవేద్యాలు. ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. ఆ ప్రసాదాన్ని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా ఆ ప్రసాదం వృధా అవ్వదు, తక్కువ అవ్వదు.
7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది.
8) ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.
ఇన్ని విశిష్టతలు సొంతం చేసుకొన్న పూరి జగన్నాథన్నాదుడు రథ యాత్ర మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.. ఈ రథ యాత్రలో పాల్గొనడానికి దేశ విదేశాలను నుంచి అనేక మంది భక్తులు తరలివస్తారు..

Comment here