భవిష్యత్తులో స్వర్ణ పతకం తప్పక గెలుస్తా

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు అన్నారు. స్వదేశానికి చేరుకున్న పీవీ. సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోచ్ గోపీచంద్ తో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ అనేది పెద్ద టోర్నీ అని., అక్కడ అందరూ గట్టి ప్రత్యర్ధులే ఉంటారని సింధు అన్నారు. అందరూ పతకం సాధించాలనే లక్ష్యంతోనే అక్కడికి వస్తారని., తాను కూడా అలాగే వెళ్లానని తెలిపారు. తాను వందశాతం ఏకాగ్రతతో ఆడినందువల్లే రజత పతకం సాధించగలిగానన్నారు.తొలి రౌండ్లో మారిన్ కు గట్టి పోటీ ఇవ్వగలిగానని సింధు అన్నారు. తనకు ఫైనల్ పోభియా లేదని..,చాలామంది ఫైనల్ కు రాకుండానే వెనుదిరుగుతున్నారని సింధు అన్నారు.ఫైనల్లో ఒడిపోయానని బాధపడే బదులుగా., తన ఖాతాలో మరో పతకం వచ్చిందని సంతోషపడతానని చెప్పారు.వచ్చే ఏడాది తనకు స్వర్ణ పతకం వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని,ఈసారి స్వర్ణం తప్పక సాధిస్తానని అన్నారు. తాను ప్రతిసారీ ఫైనల్ కు వచ్చి ఒడిపోతున్నానని చాలా మంది అడుగుతున్నారని, కానీ ఫైనల్ కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలన్నారు.ఫైనల్లో ఎవరైనా గెలవడానికే ఆడతారని అన్నారు. ఫైనల్లో ఒడిపోయినందుకు కొంత బాధ ఉన్నప్పటికీ తను చేసిన తప్పుల నుంచి మరింత నేర్చుకుని ఈసారి అనుకున్న ఫలితం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని పివి.సింధు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here