త్రివిర్ణ పతాకాన్ని ఎగరవేసిన తొలి సిఎం కరుణానిధి

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగష్టు 15న స్వాత్ర్యంత దినోత్సవ వేడుకలు జరుపుకుంటాము… ఆరోజు రాష్ట్రాల్లో జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఎగరవేస్తారు… ఈ విషయం మనకు తెలిసిందే.. కానీ 1974 వరకూ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో గవర్నర్లు మాత్రమే జాతీయ జెండా ఎగరవేసేవారు. దీనిని వ్యతిరేక్తిస్తూ.. అప్పుడు సిఎం గా ఉన్న కరుణానిధి నాటి ప్రధాని ఇందిరాగాంధీ కి ఉత్తరం రాశారు. దీంతో అప్పటి నుంచి ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో ముఖ్యమంత్రులు, జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నలు జాతీయ జెండాను ఆవిష్కరించాలని కేంద్రం ప్రకటించింది. దీంతో 1974 ఆగష్టు 15న ముఖ్యమంత్రి హోదాలో జాతీయ జెండాను కలైంజర్ ఎగురవేశారు. అప్పటినుంచీ దేశ మంతా ఈ సంప్రదాయం మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here