ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవి…?

అన్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో ఎన్టీఆర్ బాల్యం నుంచి రాజకీయ ప్రస్తానం వరకు ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మనదేశం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన రామారావు.. అనేక మంది నటీనటులతో, దర్శకులతో ప్రముఖ వ్యక్తులతో అనుబంధం కొనసాగించారు. ఇప్పటికే కొన్ని కీలక పాత్రల కోసం విద్యాబాలన్, రానా, రకుల్ ప్రీతి సింగ్, కీర్తి సురేష్, కైకాల సత్యనారాయణ వంటి వారిని క్రిష్ ఎంపిక చేశాడు.. కాగా ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తర్వాత మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నాడు.. ఎన్టీఆర్ తో చిరంజీవికి ప్రత్యెక అనుబంధం ఉంది.. చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖ పెళ్ళికి ఎన్టీఆర్ ఆమోద ముద్ర ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తూనే ఉంటాయి… ఇక ఎన్టీఆర్, చిరంజీవి కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. ఇక చిరంజీవి పాత్ర కూడా ఎన్టీఆర్ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి పాత్ర కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం తో క్రిష్ అడిగిన వెంటనే వరుణ్ తేజ్ ఒకే చెప్పినట్లు సమాచారం… ఒకే సినిమాలో ఇంతమంది.. పైగా చిరంజీవి పాత్రలో మెగా హీరో దీంతో ఎన్టీఆర్ సినిమా సంక్రాంతి కి ఓ రేంజ్ లో సందడి చేస్తుందనే చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here