ఉద్యోగాలు ఎక్కడున్నాయ్? : నితిన్ గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలు చేస్తున్నవారి నుద్దేశించి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ, క్రమేణా ఉద్యోగాల సంఖ్య తగ్గుతోందని, అందువల్ల రిజర్వేషన్లు ఉన్నంత మాత్రాన ఉద్యోగానికి భరోసా, హామీ ఉండబోవని చెప్పారు. విధాన నిర్ణేతలు ప్రతి జనసమూహములోనూ ఉన్న అత్యంత నిరు పేదల గురించి ఆలోచించాలనే అభిప్రాయం ఉందన్నారు. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై విలేకరులు అడిగినప్పుడు, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రిజర్వేషన్లు ఇచ్చారనే అనుకుందాం? కానీ ఉద్యోగాలు ఎక్కడున్నాయ్? ఉద్యోగాలు లేవు. ఎందుకంటే బ్యాంకుల్లో ఐటీ వల్ల ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రభుత్వం నియామకాలు స్తంభించిపోయాయి. ఇంకేవీ ఉద్యోగాలూ అని ప్రశ్నించారు. ఈ కోటాతో వచ్చే సమస్య ఏంటంటే వెనుకబాటుతనం ఓ రాజకీయ ప్రయోజనంగా మారుతోందని, దీంతో ప్రతివారూ తాము వెనుకబడినట్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో బ్రాహ్మణులు బలంగా ఉన్నారు. వారు రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయినా వాళ్ళు తాము వెనకపడ్డామని అంటున్నారని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పేదవాడికి కులం, మతం ఉండవన్నారు. అన్ని వర్గాల్లోనూ తిండి, బట్టలు లేనివాళ్ళు ఉన్నారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here