వాట్సప్ మెసేజ్ లు ఛార్జీల బాదుడు షురూ… ఎస్ఎంఎస్ ఛార్జీలకంటే ఎక్కువ

స్మార్ట్ ఫోన్ల అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం కూడా పెరిగింది. ఇక ముఖ్యంగా మేనేజింగ్ మాధ్యమంగా వచ్చిన వాట్సప్ ఇప్పటి వరకూ ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా తమ సర్వీస్ ను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ నెట్ వర్క్ ఉంటె చాలు… వాట్సప్ వర్క్ చేస్తుంది. దీంతో వినియోగ దారులు తమ మెసేజ్ లను చేరవేయడానికి ఎక్కువుగా వాట్సప్ పై ఆధార పడ్డారు.. పొద్దున్న లేచింది మొదలు.. నిద్ర పోయే వరకూ తమ తమ పనులను వాట్సప్ ద్వారా మెసేజ్ లు పంపి జరిపించుకున్తున్నారు. ఐతే ఇటువంటి సేవలను అందిస్తున్న వాట్సప్ కు ఇప్పటి వరకూ ఎటువంటి అదనపు ఫీజు చెల్లించలేదు.. కానీ వాట్సప్ వినియోగదారులకు షాక్ ఇస్తూ…ఛార్జీల మోతకు రెడీ అవుతుంది.. అయితే ఈ బాదుడు అందరి యూజర్లకు కాదట… కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమే… మార్కెటింగ్ కష్టమర్ సర్వీసు మెసేజ్ లు పంపే వారి నుంచి ఇక ఛార్జీలు వసూలు చేయాలని ఫేస్ బుక్ కు చెందిన వాట్సప్ నిర్ణయించిందట..

పంపించిన మెసేజ్‌ డెలివరీ అయినట్టు తెలిసిన వెంటనే ఒక్కో మెసేజ్‌కు 0.5 సెంట్ల నుంచి 9 సెంట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తామని వాట్సాప్‌ తెలిపింది. అంటే మన దేశంలో ఈ ఛార్జీలు 34.16 పైసల నుంచి రూ.6.15 వరకు ఉంటాయి. అయితే వాట్సాప్‌ ప్రస్తుతం విధించబోతున్న ఈ ఛార్జీలు ఎస్‌ఎంఎస్‌ రేట్ల కంటే ఎక్కువుగా ఉన్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 1.5. బిలియన్ యూజర్లు ఉన్నట్లు అంచనా… ఈ చార్జీల బాదుడు నిర్ణయంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఏడాది ప్రారంభం జనవరిలో చిన్న వ్యాపార అకౌంట్ల కోసం బిజినెస్ అప్లికేషన్ ను తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ను దాదాపు 30 లక్షల మంది పైగా వాడుతున్నారు. కానీ ఇంతలోనే బిజినెస్ అప్లికేషన్ నుంచి మెసేజ్ లు పంపే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మ్యాట్ ఐడేమా ప్రకటించారు.. అంతేకాదు… యూసేజ్‌ తగ్గిపోవడం, రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో, ఈ ఛార్జీలను విధిస్తున్నట్టు చెప్పారు. మరి వాట్సప్ మెసేజ్ లు సెండ్ చేస్తే.. ఎస్ఎంఎస్ రెట్ల కంటే అధికంగా ఉండడంతో.. అలవాటైన వాట్సప్ వినియోగాన్ని వదులుకుంటారా.. లేక బిజినెస్ లో ఇది భాగమే అని కొనసాగిస్తున్నా…. వినియోగదారుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది. అనేది ఈ వాట్సప్ చార్జీలు అమలు లోకి వచ్చే వరకూ వేచి చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here