గురుపున్నమి రోజున సాయిబాబానే ఎందుకు పూజిస్తున్నామంటే…

Shirdi Sai Baba Wallpapers

ఆది నుంచీ గురుపౌర్ణ‌మిని ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ… శ్రీపాద‌, శ్రీనృసింహ‌, అక్క‌ల్‌కోట‌, స్వామిస‌మ‌ర్థ‌, షిరిడీసాయిబాబా… త‌దిత‌ర అవ‌ధూత‌లు ద‌త్తాత్రేయుని అవ‌తారాలుగా పూజ‌లు అందుకోవ‌డంతో గురుపౌర్ణ‌మి నానాటికీ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటోంది.

అయితే మరి “వ్యాస పౌర్ణమి” రోజున వ్యాసుడిని పూజించాలి కదా.. మరి సాయి బాబాను ఎందుకు పూజిస్తున్నాం అని… ఎందుకంటే సాయిబాబా సమర్ధ సద్గురువు కాబట్టి.. మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెబితే, అలా జీవించి చూపిన మహోన్నత వ్యక్తి సాయిబాబా. సమత, మమత, ప్రేమ లాంటి మానవతా భావానల గురించి భక్తులకి చెప్పిన అవధూత సాయిబాబా. అన్ని మతాలూ సమతం అని భోదన చేసినవారు అయన. “ఆత్మవత్ సర్వభూతాని” అనే భగవద్గీత తత్వాన్ని చూపించి మనవ రూపంలో ఉన్న దేవుడిగా భక్తులందరికీ ఆదర్శ ప్రాయుడైన గురువుగా నిలిచారు బాబా. బాబా భోదనలు మనో వికాసాని కలిగిస్తాయి. ఉత్తమ లక్షణాలను అలవారుస్తాయి కూడా. అదే సాయి తత్వం. అందుకే గురు పౌర్ణమి రోజున సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అయిన ఆ బాబా ని ఆరాదిస్తారు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న గురుపౌర్ణమిరోజున వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here