గురువు అంటే ఎవరు..? ఆవశ్యకత ఏమిటి..?

ప్రతి ఒక్కరికి తల్లి తొలి గురువు. ఓనమాలు దిద్దించే సమయంలో తండ్రి గురువు, ఆ తరువాత జ్ఞానాన్ని భోదించే ఉపాధ్యాయుడు గురువు. అందుకే అమ్మ నాన్నాల తరువాత అంతటి ప్రాదాన్యం గురువులకి ఇచ్చాం. శిష్యులు లేని గురువులు ఉండవచ్చు కాని గురువు లేని శిష్యులుండరు…

జీవితంలో అంద‌రూ అన్నీ తెలుసుకోలేరు. అనుభ‌వంతోనూ, ఆలోచ‌న‌తోనూ, అభ్యాసంతోనూ కొంద‌రు మ‌న‌కంటే జ్ఞాన‌వంతులై ఉంటారు. అలాంటి జ్ఞాన‌సంప‌న్నులే గురువులు. “అంతా నీలోనే ఉంది. నువ్వ‌వ‌రో ముందు తెలుసుకో! ” అని చెప్ప‌డానికి కూడా ఒక గురువు కావాలి క‌దా! బ్ర‌తుక‌నే ప్ర‌యాణంలో ప్ర‌తి మ‌జిలీ గురించీ క్షుణ్నంగా తెలిసిన‌వాడే గురువు. అసలు గురువు అంటే ఏంటి?? “గు” అంటే అజ్ఞనాంధకారం అని అర్ధం.. “రు” అంటే అజ్ఞానాన్ని నిరోధించేది అని అర్ధం.. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని నిరోధించేవాడని అర్ధం.
జీవితానికి మార్గ నిర్దేశనం చేసే వారు, ముక్తి మార్గం వైపు నడిపించే వారు, తత్వ జ్ఞానాన్ని ప్రసాదించేవారు, అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుతురూ చూపించే వారు, సన్మార్గం వైపు నడిపించే వారు వీరందరూ గురువులే.. మనం భగవంతుని చేరాలంటే ముందుగా ఆ జ్ఞానాన్ని పొందాల్సింది గురువు దగ్గరే.. గురువే మనకి అనుసందాన కర్త.
అందుకే అన్నీ తెలిసిన దేవ‌త‌లైనా, అజ్ఞానానికి మారుపేరైన అసురులైనా గురువుని ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌తి గురుశిష్య బంధ‌మూ లోకానికి ఓ కొత్త ఒర‌వ‌డిని ఇస్తుంది. శ్రీ రాముని తీర్చిదిద్దిన వ‌శిష్ఠుల మహర్షి నుంచి గురువు విశిష్టతను తెలియజేయడానికి శ్రీ కృష్ణ పరమాత్ముడు సందీప మహర్షి వద్ద శిష్యరికం చేసి విద్యను అభ్యసించాడు. వివేకానందుని కార్యోన్ముఖుడిని చేసిన రామ‌కృష్ణులు ఇలా ప్ర‌తి గురువూ పూజ‌నీయులే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here