2019 ఐపీఎల్ నిర్వాహణకు మేము సిద్ధం : సౌతాఫ్రికా

సౌతాఫ్రికా వచ్చే ఏడాది ఐపీఎల్ తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తిగా ఉంది. ఐపీఎల్-2019 టోర్నీని నిర్వహించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ తెలిపింది. వచ్చే ఏడాది భారత్ లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ ను భారత్ వెలుపల నిర్వహించాలని, నిర్వాహకులు భావిస్తే.., ఆ టోర్నీని నిర్వహించేందుకు తాము సిద్ధమని సౌతాఫ్రికా తెలిపింది.2009లో భారత్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ ను సౌతాఫ్రికాలో నిర్వహించిన సంగతి విదితమే. 2019 ఐపీఎల్ ను సౌతాఫ్రికాలో నిర్వహించాలని లీగ్ నిర్వాహకులు అనుకుని మమ్మల్ని అడిగితే మేము ఒకే అని చెబుతాం, ఇందులో మాకెలాంటి అభ్యంతరాలు లేవని సౌతాఫ్రికా బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఐపీఎల్ కు ఆతిధ్యమిచ్చేందుకు సౌతాఫ్రికా, యూఏఈ ముందుంటాయని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here