వైసీపీని వీడిన ఎంపీలపై వేటు వేయాలని స్పీకర్ ని కలిసిన విజయసాయిరెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైసీపీ తరుపున ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుకలు గెలిచారు. ముగ్గురు ఎంపీలు టీడీపీ ప్రలోభాలకు లోనై పార్టీ ఫిరాయించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ లోకి ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన నలుగురు వైసీపీ ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని చాలా కాలం కిందటే మేము పిర్యాదు చేసాం. ఇప్పటివరకూ కూడా ఆ పిర్యాదులన్నీ పెండింగులో ఉన్నాయి. ఇలాంటి వారిపై చర్య తీసుకోకుంటే రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రమాదమని విజయసాయిరెడ్డి అన్నారు.స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మరింత మంది పార్టీ ఫిరాయించే అవకాశముందన్నారు. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన శరద్ యాదవ్, అన్వర్ అలీలపై 90 రోజుల్లో అనర్హతవేటు వేశారు. అదే పద్దతిలో లోకసభలో కూడా ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హతవేటు వేయాలని స్పీకర్ కిచ్చిన లేఖలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here