వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ చాలా సాయం చేశారు: హనుమ విహారి

తెలుగు యువకుడు హనుమ విహారి భారత టెస్టు జట్టుకు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఇంగ్లాండుతో జరిగే 4వ, 5వ టెస్టుల కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యులలో మన తెలుగు కుర్రవాడు హనుమ విహారి స్థానం సంపాదించాడు. ఈ నెల ఆరంభంలో సౌతాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్లో హనుమ విహారి 148 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ 24 ఏళ్ల యంగ్ హనుమ విహారికి భారత జట్టులో చోటు కల్పించారు. అయితే తాను ఈ స్థాయికి చేరడానికి భారత దిగ్గజ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ చాలా సాయం చేశారని, వారి సాయం వల్లే ఈ స్టేజ్ కు వచ్చానని గుర్తు చేసుకున్నారు. వివిఎస్ లక్ష్మణ్ నాకు స్ఫూర్తి అని హనుమ విహారి అన్నారు.అతనితో కలసి కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం దక్కిందన్నారు. అవి నా కెరీర్కు ఎంతో ఉపయోగపడ్డాయని, నా ఆట మెరుగయ్యేందుకు లక్ష్మణ్ పలు సూచనలు చేశారని అన్నారు. అలానే భారత్-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు కూడా నా ఆట మెరుగయ్యేందుకు ఎంతో దోహదపడ్డాయని హనుమ విహారి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here