Local news

జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జగన్ కు మహిళల సన్మానం

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ని వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానించారు. దీనిలో రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి.పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి శుష్క వాగ్ధానాలు చేయకుండా, అమలు చేయగల హామీలను మాత్రమే ఇస్తున్నారని ఆయనను కొనియాడారు. కాపుల సంక్షేమానికి 10 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Comment here