టాలీవుడ్ లో మరో విషాదం… ప్రముఖ నిర్మాత కె.రాఘవ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సిని నిర్మాత కోటిపల్లి రాఘవ(105) గుండెపోటు తో మృతి చెందారు. గత కొంత కాలంగా వృధాప్య రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్ప పొందుతూ మృతి చేందారు.
తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామానికి చెందిన రాఘవ ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి 30 కి పైగా సినిమాలను నిర్మించారు. భీష్మా, పలనాటి యుద్ధం, సుఖదుఖాలు, తరంగిణి, తూర్పు పడమర, వంటి అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. దర్శక రత్న దాసరి తో తాతామనవడు సినిమాను తెరకెక్కించారు. 19౭౩ సంసారం సాగరం అనే సినిమాకు నంది అవార్డ్ ను అందుకున్న ఆయన అక్కినేని జీవిత సఫ్యాల పురష్కారం, రఘపతి వెంకయ్య చలన చిత్ర అవార్డు ను సైతం అందుకున్నారు.
దాదాపు 8 భాషలపై కె. రాఘవకి పట్టుంది. దాసరి, రావుగోపాలరావు, కోడి రామకృష్ణ, సుమన్, భానుచందర్ వంటి వారి వెండి తెరకు పరిచయం చేశారు రాఘవ… 1913 జన్మించిన రాఘవ గారు తన 105 వ ఏట మృతి చెందారు.. కె. రాఘవ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here