తిరుచానూరులో వీఐపీ బ్రేక్‌ అమలు

శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వీఐపీలు వచ్చినపుడు సాధారణ భక్తులని నిలిపివేసి.. వారికి దర్శనం కల్పించేవారు. దీనిపై విమర్శలు రావడంతో బ్రేక్‌ దర్శనం నిర్ణయం తీసుకుంది టీటీడీ. నేటి నుంచి తిరుచానూరులో వీఐపీ బ్రేక్‌ అమలు కానుంది. ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ సామాన్య భక్తుల క్యూలైన్లను నిలిపి వీఐపీలకు దర్శన కల్పించనున్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here