Latest Updates

లోక్ సభ ఎన్నికల్లో తెరాస కి ఓటమి తప్పదు ! ఇదే అసలు కారణం

రాజకీయాల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు ..అయినా నాయకులు మాత్రం గ్రహబలాలకు – ముహూర్తాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు . ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేకయ యాగాల వలనే గెలిచాడని ఓ స్వామిజి సెలవిచ్చారు కూడా .. కేసీఆర్ యాగాలతో విజయం సాధించడంతో ..ఇటీవల గ్రహబలాల ప్రభావం బాగా పెరిగింది. పదేళ్ల కిందట కూడా రాజకీయ నేతలు వీటిని పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. అయితే ఇప్పుడు లీడ్ లో ఉన్న నేతలకు ఈ పట్టింపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ..ప్రత్యేకించి దక్షిణాది నేతల్లో ఈ నమ్మకాల గురించి వివరించనక్కర్లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామి, కర్ణాటక ప్రతిపక్ష నేత యడ్యూరప్పలకు ఈ నమ్మకాలు ఎక్కువ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి కూడా ఈ నమ్మకాలు బాగా పెరిగాయని ఈ మధ్య ఆయన తీరును గమనించిన వారు అంటున్నారు. ఇలాంటి నేతలందరికీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ కొంత టెన్షన్ పెట్టింది. అదెలాగంటే.. రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది .. ఆదివారం సాయత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది . క్యాలెండర్ లో టైమ్ గురించి చూస్తే.. అది వర్జ్యమని తెలుస్తోంది.. సాధారణంగా వర్జ్య కాలాన్ని సానుకూలంగా తీసుకోరు నమ్మకాలు కలిగి ఉండే వాళ్లు. అలాంటి నేతలకు ఇప్పుడు టెన్షన్ మొదలైందని టాక్. వర్జ్యంలో షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో.. దోష నివారణకు తామేం చేయాలో చెప్పాలని సదరు నేతలు పండితులను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.. ఈ విషయాల్లో సదరు నేతలు తమ ఆస్థాన పండితులు – సిద్ధాంతిలతో సంప్రదిస్తూ.. నివారణ చర్యల గురించి సలహాలు కోరుతున్నారట.. మరి తాను కొర్రుకున్న విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో అఖండ మెజారిటీ సాధించిన ..కేసీఆర్ ఇప్పుడు రాహుకాలంలో షెడ్యూల్ విడుదలవడం ..ఎన్నికలు జరిగే రోజు కూడా మంచి రోజు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారట ..మరి ఈ ఎన్నికలు కేసీఆర్ కి ఎలాంటి ఫలితాలని ఇస్తాయో చూడాలి .