ప్రధాని మోదీని కలసిన టీఅర్ఎస్ ఎంపీలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టిఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ భూముల వ్యవహారం పై ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రక్షణ శాఖ భూములు బైసన్ పోలో, జింఖానా మైదానాల వినియోగానికి సంభందించి రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం నిర్మిస్తామని దాని ద్వారా 44వ నెంబర్ జాతీయ రహదారి, ఒకటో నంబర్ రాష్ట్ర రహదారి అనుసంధానానికి వీలుగా ఉంటుందని ఎంపీలు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. జలవనరులకు సంబంధించి జాతీయ ప్రాజెక్టును కేటాయించాలని కోరారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించేందుకు బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్ ల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఎంపీలు ప్రధాని మోదీని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here