తెరాస అంటే తెలంగాణ రౌడీల పార్టీ : కాంగ్రెస్ నేత శ్రావణ్

తెరాస అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ అమరుల గురించి మాట్లాడే అర్హత తెరాసలో ఎవరికీ లేదన్నారు. తెరాస నేతలు అమరుల పేరు ఎత్తితే వారి ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ఏ అమరుడు చెబితే తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చారని శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. 2009 ఎన్నికల్లో వామపక్షాలు, టీడీపీలతో తెరాస పొత్తు ఎలా పెట్టుకుందని ప్రశ్నించారు. మీరు పొత్తు పెట్టుకుంటే నైతికం… మేము పొత్తు పెట్టుకుంటే అనైతికమా అంటూ ప్రశ్నించారు. మాది ప్రజల కూటమి, తెరాసది దొంగకూటమి అని శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here