టిఆర్ఎస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు : జానారెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. రాహుల్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే అనుమతి రాలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం కావాలనే కొంతమందిని రెచ్చగొట్టి రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణ సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ వస్తున్నారని జానారెడ్డి చెప్పారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చిందని తెలిపారు. కానీ తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని జానారెడ్డి ధ్వజమెత్తారు.వారికి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here