Latest Updates

వైసీపీలో చేరిన అలీ ! పోటీ ఇక్కడ నుంచే

Tollywood Comedian Ali joins YCP Party

గత కొంతకాలముగా రాజకీయంగా ఊగిసలాటలో వున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ ఎట్టకేలకు ఒ నిర్ణయం తీసుకున్నారు ..ఈ రోజు ఉదయం అయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ
వైసీపీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అలీ వెంట నటుడు కృష్ణుడు కూడా ఉన్నాడు కాగా.. టికెట్‌పై జగన్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే… ఆయన వైఎస్ అధినేత జగన్,టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు . కాగా.. వైసీపీ తరఫున అలీ.. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. పోటీ ఎక్కడ్నుంచి అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల అలీ మాట్లాడుతూ ..ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రిపదవిపై ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు ..అటువంటి హామీ టీడీపీ నుంచి రాకపోవడం..అ డే సమయంలో వైసీపీ నుంచి హామీ లభించడంతో అయన జగన్ గూటికి చేరారని తెలుస్తుంది .. మొత్తానికి నెలకు పైగా ఊగిసలాటలో వున్న అలీ చివరకి ఫ్యాన్ గాలి కోసం వెళ్లారు ..