శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు.. ఘనంగా జరుగుతున్న ఏర్పాట్లు

వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం లో దసరా నవరాత్రులలో బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను అంకురార్పణతో ప్రారంభించి ధ్వజారోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతా మూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజ పటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.. ఇక నిత్యం రద్దీగా ఉండే శ్రీ వారి ఆలయం… ఇక ప్రత్యెక ఉత్సవాల సమయంలో మరింత సందడిగా ఉంటుంది. ఇక శ్రీవారి ఉత్సవాల్లో భక్తులు అత్యంత ఇష్టంగా దర్శించుకునే ఉత్సవం బ్రహ్మోత్సవం.. అఖిలాండ నాయకుడికి.. చేసే బ్రహ్మోత్సవం చూడడానికి రెండు కళ్ళు చాలవు… రధం పై స్వామివారు ఊరేగుతూ… పూలతేరుపై విహరిస్తుంటే… భక్తులు అది దర్శించుకుని పులకించి పోతారు.. కాగా ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. అక్టోబర్‌ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది. టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఉత్సవాల్లో చోటుచేసుకున్న జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఈ ఉత్సవాలకు మెరుగైన ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌ చెప్పారు.

రెండు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునే విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేయనుంది టీటీడీ. మాడ వీధుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు.. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాల సేవలను సైతం బ్రహ్మోత్సవాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో స్పష్టం చేశారు.
ఇక ఉత్సవాల్లో ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవల్లో మార్పులు చేయనుంది టీటీడీ. శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభించనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 7 లక్షల లడ్డూలను స్టాక్‌ పెట్టుకోనుంది. గరుడ వాహన సేవ రోజు కొండపైకి టూ వీలర్స్‌ అనుమతించబోమని ఈవో తెలిపారు. ఇక పిన్స్‌ సిస్టమ్‌, చైల్డ్‌ ట్యాగింగ్‌ సిస్టమ్‌ను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి చెప్పారు. పార్కింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో యాప్‌ను ప్రారంభిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here