గురువారం విశాఖలో భారీగా ఐటీ దాడులు నిర్వహించబోతోంది

ఆంధ్రప్రదేశ్ టార్గెట్ గా ఐటీ మరోసారి గురువారం రంగంలోకి దిగబోతోంది. కొన్ని రోజుల క్రితం రాజధాని ప్రాంతంలో పరిసర జిల్లాలో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు విశాఖపై కన్నేసినట్లు తెలుస్తోంది. గురువారం విశాఖలో ఐటీ అధికారులు భారీగా దాడులు చేసే అవకాశముందని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విశాఖ పట్టణానికి నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ అధికారులు భారీగా చేరుకున్నారు. షుమారు 50 మంది అధికారులు వివిధ మార్గాల ద్వారా విశాఖ పట్టణానికి చేరుకున్నారు. చెన్నై, బెంగళూరు ఒడిషా, తెలంగాణ నుంచి ఐటీ అధికారులు విశాఖ చేరుకున్నారు. విశాఖలో కొంతమంది పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి దాడులకు సిద్ధంగా ఉండాలని టీం సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బుధవారం సాయంత్రం వారంతా సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లారు. విశాఖలో పోలీసు అధికారులు, కొంతమంది ఆడిటర్లకు కూడా ఐటీ అధికారులు వచ్చినట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖలోని పారిశ్రామిక వేత్తల్లో కలకలం మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here